23-01-2026 06:40:33 PM
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరావు శుక్రవారం అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. 44వ డివిజన్ బీజేపీ తరపున కార్పొరేటర్‌గా పోటీ పడుతున్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి, బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ, దేశాభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం బీజేపీ చేపడుతున్న విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం తనను ఆకర్షించాయని తెలిపారు. రాబోయే రోజుల్లో 44వ డివిజన్ అభివృద్ధికి బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ బీజేపీ నాయకులు లింగగిరి వెంకటరామయ్య, కిన్నెర శ్రీను, బొల్లెపోగు నాగేశ్వరావు, ఆగారెడ్డి వెంకట్ రెడ్డి, కొత్తపల్లి విజయ్, చింతలచెర్వు శేఖర్, బానోత్ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.