23-01-2026 06:58:26 PM
జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): రాష్ట్రంలోని 32 వరి సేకరణ జిల్లాల పనితీరును సివిల్ సప్లై కమిషనర్ సమీక్షించగా, సేకరణ, సయోధ్య, ఎఫ్ సి ఐ క్లెయిమ్‌లు తదితర ఐదు వేర్వేరు కేటగిరీల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఐదు జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి విభాగంలో మెరుగైన పనితీరు కనబరిచిన జిల్లాలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీందర్ ప్రశంసించారు.
ఈ క్రమంలో రైతులకు సకాలంలో ఎంఎస్పి చెల్లింపులు విభాగంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. రైతులకు మూడు రోజుల్లోపు ఎం ఎస్ పి చెల్లింపులు పూర్తిచేయడం ద్వారా జిల్లా అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు, కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు DM శ్రీకాంత్‌లకు పౌరసరఫరాల శాఖ మంత్రి, సిసిఎస్ చేతుల మీదుగా కమెండేషన్ సర్టిఫికెట్లు శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట, ప్రాణహిత హాల్‌లో అందజేశారు. ఈ సందర్భంగా DCSO DM మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ వారి మార్గనిర్దేశం, సంబంధిత అధికారుల సమన్వయ కృషి ఫలితంగానే కామారెడ్డి జిల్లా వరి సేకరణలో ఈ గొప్ప రాష్ట్ర స్థాయి గుర్తింపును సాధించిందని తెలిపారు.