23-01-2026 06:45:45 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో శ్రీ గోదాదేవి పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా శుక్రవారం నాగప్రతిష్ట హోమము, శ్రీ గోదాదేవి పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణము కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సర్పంచ్ శ్రీనివాసరావు , కార్యదర్శి నాయన పెద్ద బాల్రెడ్డి, ట్రెజరర్ గంట చంద్రశేఖర్, దేవాలయ ఫౌండర్ చైర్మన్ నాయిని లక్ష్మీనారాయణ రెడ్డి, పుట్ట పెద్ద లక్ష్మీనరసింహారెడ్డి, పుట్ట బాపురెడ్డి గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు