calender_icon.png 10 July, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు కాటు

10-07-2025 01:33:41 AM

ఐదుగురు బలి

  1. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు 
  2. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 27 మంది
  3. కూకట్‌పల్లిలో పలు కాంపౌండ్లు సీజ్
  4. ఐదుగురిపై కేసు, ఇద్దరి అరెస్ట్ 
  5. ఓ మహిళ మృతిని దాచిపెట్టే యత్నం 
  6. అంత్యక్రియలు అడ్డుకున్న పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు: ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి)/కూకట్‌పల్లి: హైదరాబాద్‌లో మంగళవారం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నవారిలో ఐదుగురు మృతిచెందారు. మృతు ల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఆస్పత్రిలో 27 మంది చికిత్స పొం దుతున్నారు. ఘటనకు కారణమైన కూకట్‌పల్లి, కేపీహెబీ పరిధిలోని పలు కల్లు కాంపౌండ్లను పోలీసులు సీజ్ చేశారు.

ఐదుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం కూకట్‌పల్లిలోని ఉషాము ళ్లపూడి రోడ్డు, కేపీహెచ్‌బీలోని హైదర్‌నగర్, ఎల్లమ్మబండ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లలో పలువురు కూలీలు, స్థానికులు కల్లు తాగారు. కాసేపటికే వారంతా తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలతో కుప్ప కూలారు. కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆస్పత్రి, నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించారు.

గాంధీలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందగా.. రాందేవ్ ఆస్పత్రిలో ఒక రు మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ మంగళవారం మృతిచెందింది. ఆమె మరణించిన విషయాన్ని బయ టకు చెప్పకుండా అంత్యక్రియలు జరిపేందు కు కుటుంబసభ్యులు బుధవారం సిద్ధమవ గా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల్లో హెఎంటీ హిల్స్ సాయిచరణ్‌కాలనీకి చెందిన సీతారాం (47), చాకలి బొజ్జయ్య (55), నారాయణ మ్మ (65), మౌనిక(25), స్వరూప(56) ఉన్నారు. వనపర్తి జిల్లా నందిగట్ల గ్రామానికి చెందిన తులసీరాం హెచ్‌ఎంటీ హిల్స్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసము ఉంటూ రోజువారి కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

హైదర్‌నగర్ కల్తీ కల్లు ఘటనలో బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు కల్లు కాం పౌండ్ నిర్వాహకులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. చింతకింది నగేష్‌గౌడ్, బట్టి శ్రీనివాస్‌గౌడ్, టి శ్రీనివాస్‌గౌడ్, కె కుమార్‌గౌడ్, తీగల రమేష్‌లపై కేసు నమో దు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

సుమారు 674 లీటర్ల కల్తీ కల్లును సీజ్ చేశా రు. ఎక్సుజ్, పోలీసు అధికారులు ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిళ్ల ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

మహిళ మృతిని దాచిపెట్టే యత్నం

కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన స్వరూప అనే మహిళ నాలుగు రోజుల క్రితం నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, మంగళవారం మృతిచెందింది. ఈ విష యం బయటకు పొక్కకుండా ఉండేందుకు కల్లు కాంపౌండ్ యజమాని మృతురాలి కుటుంబంతో మంతనాలు జరిపి, గుట్టుచప్పుడు కాకుండా బుధవారం అంత్యక్రియల కు ఏర్పాట్లు చేయించాడు.

అయితే, కల్తీ కల్లు వల్లే ఆమె మరణించిందన్న సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు శ్మశానవాటికకు చేరుకుని అంత్యక్రియలను మధ్య లోనే ఆపేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, ఆమె కుమారుడి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.

కారకులపై చర్యలు: మంత్రి జూపల్లి

ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ ఈ ఘటనపై స్పందించారు. మంత్రి జూపల్లి నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే మూడు కల్లు కాంపౌండ్లను సీజ్ చేశామని వెల్లడించారు.