calender_icon.png 10 July, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాకర్‌రావు లాప్‌టాప్, ఫోన్ సిట్ చేతికి

10-07-2025 01:29:00 AM

  1. దర్యాప్తులో కీలకం కానున్న డిజిటల్ ఆధారాలు
  2.   14న విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 9 (విజ యక్రాంతి) : రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టి స్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ర్ట ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావుకు చెందిన వ్యక్తిగత లాప్‌టాప్, ఫోన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఈ పరికరాలు కేసు విచారణలో అత్యంత కీలకమైన డిజిటల్ ఆధారాలుగా మారనున్నాయని సిట్ వర్గాలు భావిస్తున్నాయి.

విచారణకు సహకరిస్తానని చెప్పేం దుకు ప్రభాకర్‌రావు, తన బంధువుల ద్వారా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను సిట్ అధికారులకు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రానికి సంబంధించిన కీలక సమాచారం, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరి ఆదేశాలతో ఈ తతంగం నడిచింది, సేకరించిన సమాచారాన్ని ఏం చేశారు, అనే వివరాలు ఈ లాప్‌టాప్, ఫోన్‌లో నిక్షిప్తమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరికరాలు..

స్వాధీనం చేసుకున్న లాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు తక్షణమే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు. వాటిలో దాగి ఉన్న సమాచారాన్ని వెలికితీయడంతో పాటు, ఒకవేళ డిలీట్ చేసి ఉంటే ఆ డేటాను సైతం రికవరీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పరికరాల నుంచి లభించే ఆధారాలతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుందని, అసలు సూత్రధారులను గుర్తించేందుకు మార్గం సుగమం అవుతుందని సిట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని, ఎన్నికల ఫలితాల తర్వాత కీలక ఆధారాలున్న హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్ రావు లాప్‌టాప్ నుంచి లభించే సమాచారం ఈ కేసును ఒక కొలిక్కి తెస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ప్రభాకర్ రావు బంధువుల ద్వారా ఆయన వ్యక్తిగత లాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధ్వంసం చేశారని భావిస్తున్న హార్డ్ డిస్క్‌లలోని సమాచారానికి ప్రత్యామ్నాయంగా, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఇప్పుడు అత్యంత కీలక ఆధారాలుగా మారా యి. వీటిని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటి నుంచి లభించే డేటా, ప్రభాకర్ రావు జరిపిన సంభాషణలు, బీఆర్‌ఎస్ నేతలు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్న సంబంధాలపై పూర్తి స్పష్టత వస్తుందని సిట్ భావిస్తోంది.

14న విచారణకు రావాలని ఆదేశం..

ఈ నేపథ్యంలో, జూలై 14న విచారణకు హాజరుకావాలని ప్రభాకర్‌రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అటు ఫోన్ ట్యాపింగ్‌కు గురైన నేతలకు ఫోన్లు చేసి, వారి నుంచి సాక్ష్యాలను, స్టేట్‌మెంట్లు నమోదు చేస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక, సాక్షుల వాంగ్మూ లాల ఆధారంగా ప్రభాకర్‌రావును మరోసారి లోతుగా ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమవుతోంది.