ఏసీబీకి చిక్కిన ఏఈ
బిల్లుల క్లియర్‌కు రూ.50 వేలు డిమాండ్
హుజురాబాద్, ఏప్రిల్15(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా పనిచేస్తున్న నుసుం సుధాకర్ రెడ్డి బుధవారం ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డా రు. అందిన వివరాల మేరకు.. కాంట్రాక్టర్ ఒకరు హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో తుపా ను నీటి కాలువల నిర్మాణ పనులను పూర్తి చేశారు.
ఫైనల్ బిల్లును ప్రాసె స్ చేయడం, మెజర్మెంట్ బుక్‌లో నమో దు చేయడం కోసం సుధాకర్‌రెడ్డి రూ. 50,000 లంచం ఇవ్వాలని ఆ కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారు లు పక్కా ప్రణాళికతో హుజూరాబాద్‌లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద కాంట్రాక్టర్ నుంచి లం చం తీసుకుంటున్న సమయంలో సుధాకర్ రెడ్డి ని పట్టుకున్నారు.నిందితుడిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.






