వీబీ జీ రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలి
వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యుడు కంబాలపల్లి ఆనంద్
దేవరకొండ, ఏప్రిల్ 15 : విబి జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి అని వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు .బుధవారం దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం ఎంపిడిఓకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యూపీఏ వన్ హాయంలో సామాజిక భద్రత, వలసల నివారణలో భాగంగా, కమ్యూనిస్టు పార్టీలు పోరాడి సాధించిన జాతీయ ఉపాధి ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి విబిజి రాంజీ పథకం పేరుతో ఉపాధి కూలీల పొట్టగొట్టే చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ చట్టానికి వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కావలి కృష్ణయ్య , మండల బాధ్యులు నరసింహ, శోభ, జి పుష్ప, బాలయ్య, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.






