18 July, 2026 | 6:18 PM

Breaking News

ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •  

ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో

18-07-2026 06:18 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్నీనో ప్రభావం వల్ల సాధారణంగా వర్షపాతం తగ్గడం,అధిక ఉష్ణోగ్రతలు,కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఏవో సాయికిరణ్ తెలిపారు.శనివారం మండలంలోని గోపాల్పేట్,మెల్లకుంట తండా గ్రామాలలో రైతులకు ఎల్ ని నో ప్రభావం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో సాయికిరణ్ మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం పరిస్థితుల్లో తక్కువ నీటితో పెరుగే, తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే పంటలను ఎంచుకోవడం మంచిదని, పంటలు వేయడానికి అనుకూలమైన పంటలు జొన్న,సజ్జ,రాగి, పెసర, మినుములు, కంది, సెనగ,నువ్వులు,ఆముదం తక్కువ కాలంలో పండే విత్తన రకాలను ఎంచుకోవాలని తెలిపారు.వర్షం వచ్చిన వెంటనే విత్తనం వేయాలని పొలంలో తేమ నిల్వ ఉండేలా మల్చింగ్ లేదా ఇతర తేమ సంరక్షణ పద్ధతులను పాటించాలని డ్రిప్ వంటి నీటి పొదుపు పద్ధతులను ఉపయోగిస్తే ప్రయోజనం కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, బాల్య నాయక్,ఏవో సాయికిరణ్ రైతులు పాల్గొన్నారు.