06-11-2025 01:59:06 PM
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్డి హండ్రెడ్ గా పట్టుబడిన ఏఈఓ సందీప్.
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఏసీబీ(Anti Corruption Bureau) దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నీల్కుర్తి క్లస్టర్ ఏఈఓ సందీప్ 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే ఆనేపురం గ్రామానికి చెందిన రైతు గత నెలలో చనిపోగా వారి దరఖాస్తును రైతు భీమా కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి 20000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దానికి మొదటగా పదివేల రూపాయలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకొని ఈరోజు బస్టాండ్ సమీపంలోని జేజే రెస్టారెంట్ ఎదురుగా ఏఈఓ సందీప్ బాధితుడు ఇస్తుండగా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపారు.