06-11-2025 01:55:55 PM
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులో రహదారి కోసం ధర్నా చేసినవారిపై పోలీసు కేసు(Police case) నమోదైంది. రోడ్డు బాగు చేయాలని ధర్నాచేసిన 25 మంది స్థానికులపై కేసు నమోదు చేశారు. ప్రజారహణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు బుక్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం కంకరతో నిండిన టిప్పర్ లారీ టీజీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన(Chevella bus accident) ఘటనలో 14 మంది మహిళలు, 10 నెలల శిశువుతో సహా కనీసం 19 మంది మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. 19 మంది మృతికి రోడ్డు సరిగా లేదని ఆరోపిస్తూ తాండూరులో స్థానికులు ధర్నా చేపట్టారు.