06-11-2025 01:41:28 PM
డాక్టర్ సంగని మల్లేశ్వర్, పాస్ రాష్ట్ర అధ్యక్షులు
కాకతీయ యూనివర్సిటీ,(విజయక్రాంతి): విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీసీ జేఏసీ(BC JAC) అష్టంగా ఆందోళనలో భాగంగా ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి మాట్లాడుతూ రిజర్వేషన్స్ అమలుకు బీజేపీ పెద్దన్న పాత్ర పోషించి, తొమ్మిదోవ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంట్ లో చట్టభద్దత కల్పించాలని డిమాండ్ చేసారు.
బీసీలను ఓటు బ్యాంకుగా చూసే పార్టీలకు భవిష్యత్తులో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు దరించి పూలే ప్రాంగణంలో మౌన దీక్ష చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకార్ల కమిటీ చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట్ నారాయణ, బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్, ఇంటలెక్చవల్ ఫోరం కన్వీనర్ డాక్టర్ కె. వీరస్వామి, పాస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య, పాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, కుర్స మాజీ అధ్యక్షులు డాక్టర్ తాళ్లపల్లి నరేష్, పాస్ నాయకులు శ్రీరామ్ వీరయ్య, బోళ్ల వీరప్రతాప్, బేరే కేదారి, గుడిశాల సుదర్శన్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ చాగంటి శ్రీనివాస్, సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వంగల సుధాకర్, విద్యార్ధి, తదితర సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు