06-11-2025 02:18:21 PM
పాట్నా: బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లలో మొత్తం 42.31 శాతం(Bihar Assembly Election Voting percentage) మంది మధ్యాహ్నం 1 గంట వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోపాల్‌గంజ్ జిల్లాలో ఇప్పటివరకు అత్యధిక పోలింగ్ శాతం 46.73గా నమోదైంది. తరువాత లఖిసరాయ్ 46.37 శాతం, బెగుసరాయ్ 46.02 శాతం పోలింగ్ నమోదైంది. ఉన్నాయి. అధికార ఎన్డీఏకు అగ్నిపరీక్షగా భావించే అత్యంత ప్రతిష్ఠాత్మక అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తమ ఓటు హక్కు వినియోగించుకుని అందరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బీహార్ అసెంబ్లీ తొలివిడత ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగునుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్ ఎన్నికల తొలి దశ సందర్భంగా పాట్నాలోని పోలింగ్ బూత్‌లో బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్, ఆయన భార్య మాయా శంకర్ ఓటు వేశారు. బలమైన బూత్‌లలో విద్యుత్ కోతలున్నాయనే ఆర్జేడీ వాదనను ఈసీ తోసిపుచ్చింది. బీహార్ అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్ పాట్నాలో ఓటు వేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కలిసి, ఈసీఐ పర్యవేక్షణ గది నుండి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ సందర్భంగా పాట్నాలోని వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్ పోలింగ్ బూత్‌లో తమను ఓటు వేయడానికి అనుమతించలేదని ఇద్దరు మహిళలు ఆరోపించారు.
