calender_icon.png 6 November, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్చరీలో సత్తా చాటుతున్న ఖానాపూర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

06-11-2025 01:44:35 PM

అండర్ 19 జాతీయ పోటీలకు ఖానాపూర్ విద్యార్థి ఎంపిక 

ఖానాపూర్ (విజయక్రాంతి): ఆర్చరీ( విలువిద్య) పోటీలలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ విద్యార్థులు తమ సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న అందే నితిన్ అనే విద్యార్థి ఇటీవల తెలంగాణ మహబూబాబాద్ లో జరిగిన అండర్ 19 విభాగంలో ఆర్చరీ పోటీలలో విజయం సాధించి కాంస్య పథకం సాధించినట్లు ఆర్చరీ సంఘం జిల్లా సెక్రటరీ భూక్య రమేష్, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ రవీందర్ గౌడ్, కోచ్ బొంతు అంబేద్కర్ కుమార్ లు తెలిపారు.

ఈ సందర్భంగా కోచ్ అంబేద్కర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కష్టానికి ఫలితం అందే నితిన్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలలో సత్తా చాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం హర్షనీయమని ,శ్రమ పడితే కచ్చితంగా ఫలితాలు ఉంటాయని అన్నారు .ఈమేరకు డిసెంబర్ రెండవ వారంలో మణిపూర్ రాష్ట్రం షిల్లాంగ్ లో జరిగే జాతీయస్థాయి విలువద్య పోటీలలో పాల్గొననున్నాడని కోచ్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక క్రీడాభిమానులు, క్రీడాకారులు, విద్యార్థిని, కోచ్ ని అభినందిస్తున్నారు.