calender_icon.png 6 November, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీమల భయంతో వివాహిత సూసైడ్

06-11-2025 02:38:51 PM

అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పిఎస్  మంగళవారం సాయంత్రం  05:30 గంటల సమయంలో  అమీన్ పూర్ పరిధిలోని, నవ్య హోమ్స్ నందు ఒక వివాహిత ద్యావనపెళ్ళి మనిషా(25) చీమలకు భయపడి(మైర్మేకోఫోబియా) ఇంట్లో ఫ్యానుకి చీరతో ఉరివేసుకొని చనిపోయింది. 2022 సంవత్సరంలో మనీషాకి మంచిర్యాలవాసి అయిన చిందం శ్రీకాంత్ (35) అను వ్యక్తితో వివాహం జరిగినది. వారికి ఒక కూతురు అన్నిక(3), రెడున్నర సంవత్సరాల క్రితం ఉద్యోగరిత్యా భార్య భర్తలిద్దరూ అమీన్ పూర్ కి వచ్చి నవ్య హోమ్స్ నందు నివాసం ఉంటున్నారు.

అయితే  మనిషాకి చిన్నప్పటి నుండి చీమలు అంటే భయం. మంగళవారం ఉదయం భర్త డ్యూటీకి  వెళ్లాడు  సాయంత్రం 05:30  సమయంలో భర్త ఇంటికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ లోపలి నుండి గడి పెట్టి ఉండడంతో చుట్టుప్రక్కలవారి సహాయంతో తలులుపు బద్దలు కొట్టి చూడగా మనీషా ఇంట్లో ఫ్యానుకి చీరతో ఉరివేసుకొని వేలాడుతూ ఉన్నది.  పోలీసులు గదిని పరిశీలించగా అక్కడ ఒక నోట్‌బుక్‌లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో శ్రీ ఐయాం సారీ ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు.. కూతురు అన్వి జాగ్రత్త అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు తీర్చండి అని రాసి ఉంది.ఈ సూసైడ్ నోట్ ఆమె ఫోబియా తీవ్రతను, మానసిక క్షోభను తెలియజేస్తుంది. సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు