calender_icon.png 6 November, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

06-11-2025 02:34:20 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి భారత రాష్ట్రసమితి ఫిర్యాదు చేసింది. బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని(State Chief Electoral Officer Sudarshan Reddy) శాసనమండలి ప్రతిపక్ష నేత  ఎస్. మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మహమ్మద్ షకీల్ అమీర్, బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, కిషోర్  గౌడ్, సల్మాన్ ఖాన్, ఇతర బీఆర్ఎస్ మైనార్టీ నేతలు కలిశారు. ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కోరారు. ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మైనార్టీ నేతలు సీఈవో సుదర్శన్ రెడ్డికి వేరువేరుగా ఫిర్యాదులు చేశారు.