9 April, 2026 | 2:46 AM

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపైనే దృష్టి

09-04-2026 12:00 AM
  1. గత ఎన్నికలు బీజేపీకి సానుకూలంగా ఉన్నా రేవంత్ వైపు గాలి వీచింది
  2. మహిళా రిజర్వేషన్‌ను కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తున్నది
  3. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి: ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపైనే బీజేపీ దృష్టి సారిస్తుందని ఆ పార్టీ రాజ్యసభసభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. గత ఎన్నికలు బీజేపీకి సానుకూలంగా ఉన్నా.. రేవంత్ వైపు గాలి వీచిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ను కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తర్వాత మొత్తం బీజేపీకి వన్‌సైడ్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

బుధవారం నాంప ల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి పకడ్బందిగా అమలుచేస్తాం అంటున్నారని, అయితే ఎన్నికల ప్ర చారంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విషనా గులని.. వాటిని చంపాలంటున్నారని, మరి దీని గురించి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని, ఇవి హెట్ స్పీచ్ కాదా? అని నిలదీశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం ఆలోచన చేస్తా రో రెండో వ్యక్తికి కూడా తెలియదని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అవుతారని ముందుగా ఎవరూ ఊహించలేదని వివరించారు. బీజేపీలో మోదీ నాయకత్వంలో ఊ హాగానాలకు తావులేదన్నారు. నేతలు ముం దే డిసైడ్ అయితే.. పార్టీ ఎన్నడూ ముందు కు పోదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వా త తెలంగాణపై జాతీయ నాయకత్వం దృష్టి పెడుతుందని, ఇక్కడ బీఆర్‌ఎస్ నిలబడటం అంత ఈజీ కాదని పేర్కొన్నారు.

కల్వకుంట్ల కవిత ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్ప డం లేదని, కవిత పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడితే బాగుండేదని అన్నారు. తాము బీఆర్‌ఎస్‌తో వెళ్లే ఆలోచన లేదని స్పష్టంచేశారు. తమిళనాడులలో విజయ్ పార్టీ పెడితే జనాలు పిచ్చిగా వస్తున్నారు.. కానీ ఐదారు సీట్ల కంటే ఎక్కువ గెలువరని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని తెలిపారు.

ఢిల్లీలో తాము గెలుస్తామని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు. ప్రజ లు తెలివైనవారని, బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రాగా.. ఎంపీ ఎన్నికల్లో 38 శాతం ఓట్లు వచ్చాయన్నారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీదే పైచేయన్నారు. ఒక ఎన్నికను మాత్రమే తీసుకొని ఎప్పుడూ అంచనా వేయడం తప్పని వెల్లడించారు.