ఇది మానవీయ బడ్జెట్
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
ముషీరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మానవీయ బడ్జెట్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ 20 26 భవిష్యత్తు ఆకాంక్షలు అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ మానవ కోణంలో పేదల సంక్షేమం కోసం ఆవిష్కరించబడిందని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్‌ఎస్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలకు ప్రజల ఆకాంక్షాలు అవసరాలు తెలుసునని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలని అద్దంకి దయాకర్ కోరారు. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తు న్నాయని ఆరోపించారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ కె. సీతారామారావు మాట్లాడుతూ పనితీరును బట్టి ఆయా ప్రభుత్వ శాఖలకు నిధు లు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అప్పుచేసి పప్పుకూడులా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్‌గా ఉందన్నా రు. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని డాక్టర్ ఎర్రోజ్ శ్రీనివాస్ హెచ్ రవీందర్ సమన్వయం చేశారు.




