రేషన్ షాపులకు సన్న బియ్యం పంపిణీ
3 నెలల రేషన్ ఇవ్వడంతో గోదాం అధికారుల ముందస్తు ప్రణాళిక
212 రేషన్ షాపులకు ఇప్పటికే చేరిన సన్న బియ్యం
రాజేంద్రనగర్ ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఎండా కాలన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేదలకు అందిస్తున్న సన్న బియ్యం ను మూడు నెలల కోటాను కలిపి ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందు కు అనుగుణంగా పేదలకు సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందుకు తలెత్త కుండా కిస్మత్ పూర్ సివిల్ సప్లై స్టేజి 2 గోదాం లోని గోదాం 1. గోదాం 2 అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అన్ని రేషన్ షా పుల్లో సన్న బియ్యంను అందుబాటులో ఉంచేందుకు స్టేజి 1 స్టేజి 2 ట్రాన్స్ పోర్ట్ కాం ట్రాక్టర్లను సమన్వయం చేసుకొని 8 వ తేది నాటికి రాజేంద్రనగర్ లోని 60 రేషన్ షాపులకు. శేర్లింగంపల్లి లోని 53 రేషన్ షాపులకు. గోదాం 2 - లోని గండిపేట పరిధిలోని 26 షాపులకు. మొయినాబాద్ లోని 33. షాపులకు శంషాబాద్ 40 షాపులకు కలిపి మొ త్తం 212 రేషన్ షాపులకు గాను 70% సన్న బియ్యం ను సరఫరా చేసినట్లు గోదాం అధికారులు మురళీకృష్ణ యాదవ్. భార్గవ్ రెడ్డి తెలిపారు.
గోదాం 1 పరిధిలో 4200 మెట్రి క్ టన్నుల బియ్యంను .గోదాం 2 పరిధిలో 5200 మెట్రిక్ టన్నుల సన్నబియాన్ని ఇప్పటికే రేషన్ దుకాణాలకు పంపడం జరిగింది వారు పేర్కొన్నారు ఎండాకాలం అయి నప్పటికీ హమాలీలను సమన్వయం చేసుకుని లారీలకు ఎప్పటికప్పుడు లోడ్ చేయిం చి 5 మండలాల్లోని రేషన్ దుకాణాలకు పం పుతున్నట్లు గోదాం అధికారులు తెలిపారు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో స్టేజి 2 గోదాం నుండి రేషన్ షాపులకు సకాలంలో సన్న బియ్యంను అందజేస్తున్నాం. మూడు నెలల రేషన్ బియ్యంను ఒకే నెలలో సరఫరా చేయడంవల్ల రవాణాకు కొంత ఇబ్బంది అయినా.. బియ్యం రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంచడం వల్ల రేషన్ వినియోగ దారులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని స్టేజి 2 గోదాం ఇంచార్జ్ మురళీకృష్ణ యాదవ్ తెలిపారు.
యాదవ్, గోదాం 2 ఇంచార్జీ




