స్నేహితులను కాపాడి.. మృత్యుఒడికి
- ప్రాణాలు కోల్పోయిన రంగారెడ్డి జిల్లా విద్యార్థి
- అమెరికాలోని లూసియా నదిలో ఘటన
అబ్దుల్లాపూర్ మెట్, మే 31(విజయక్రాంతి): అమెరికాలోని లూసియాలో గల నదిలో కొట్టుకుపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా చెందిన విద్యార్థి మృత్యువాతపడ్డాడు. అనురూపురెడ్డి తన ముగ్గురు స్నేహి తులతో కలసి ఈత కొడుతుండగా హఠాత్తుగా వారిలో ఒక్కొక్కరు లోతు ప్రదేశం లోకి వెళుతూ రక్షించండి అంటూ హహాకారాలు చేశారు. దీంతో అనురూప్ రెడ్డి ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఓడ్డు కు చేర్చారు.
అయితే అనురూపు రెడ్డి పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకుంది. ఇంతలో నీటి ప్రవాహం పెరిగి అందులోనే అనురూపు రెడ్డి మృత్యువాత పడ్డాడు. స్నేహితులు, అక్కడున్న ఇతర ఈతగాళ్లు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. అనురూప రెడ్డి నీటిని ఎక్కువగా మింగడంతో చనిపోయారు. స్థానిక ఆసుపత్రిలోనే అనురూప రెడ్డికి చికిత్స అందించి నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.
ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కాలేదు.. టీం ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సోలేట్‌లు సంయుక్త సహకారాలు అందించి మరో వారం రోజుల్లోగా అతని భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించను న్నారు. హైదరాబాద్ నగర శివారు అబ్దు ల్లాపూర్‌మెట్ మండలం కవాడి పల్లి గ్రా మానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ రెడ్డి కోడూరు దుర్గ భవాని కోడూరు దంపతులకు అనురూపరెడ్డి రెండో సంతానం.
మొదటి కుమారుడు ఆశ్రీత్ రెడ్డి 2023 లో , అనురూప రెడ్డి సైతం 2024 లో అమెరికాకు వెళ్లారు.జూన్ నుంచి ఉద్యోగ అన్వేషణ చేయాల్సిన క్రమంలో సరదాగా గడిపే ఉద్దేశంగా క్యాంపింగు వెళ్లిన వారు ఇలా విగతా జీవిగా చూస్తామని అనుకోలేదని సోదరుడు చెప్పాడు.స్నేహితుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది.






