రాజకీయ పార్టీల అలర్ట్!
- సర్ పై క్యాడర్ కు అవగాహన
- పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తం
- రంగంలోకి పార్టీల అగ్ర నాయకులు
- జూన్ 25 నుంచి ఇంటింటికి బీఎల్‌ఓలు
- జిల్లాలో బోగస్ ఓట్ల తొలగింపునకు అధికారుల సన్నద్ధం
మేడ్చల్, మే 31 (విజయ క్రాంతి): ఓట రు జాబితా సమగ్ర సవరణ చేపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు తమ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నాయి. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలకు అవగాహ న కల్పిస్తున్నాయి. పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా, ఎదుటి పార్టీలో బో గస్ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని క్యాడర్ కు సూచిస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి స ర్ గురించి క్యాడర్ కు ప్రత్యేకంగా సూచనలు ఇస్తున్నారు.
కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాలు
కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా సంఘటన సృజన్ అభియాన పేరట సమావేశాలు నిర్వహిస్తోంది. డివిజన్ కమిటీలు, బి ఎల్ ఏ లా నియామకం పై సమావేశం సమావేశా లు నిర్వహిస్తోంది. ఇప్పటికే మేడ్చల్, మల్కాజిగిరి, కుతుబుల్లాపూర్ నియోజకవర్గాలలో సమావేశాలు జరిగాయి. బి ఎల్ ఏ లు బూ త్ స్థాయి బాధ్యులు. సర్ లో ఎవరు ఓట్లు తొలగిస్తున్నారు, ఎవరి ఓటు చేర్చుతున్నారనేది చూసేది వీరే.
అందుకే బిఎల్ ఏ ల ని యామకానికి కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇటీవల గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో సర్ పై శ్రేణులను అప్రమత్తం చేశారు. సర్ కోసం రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ, పార్లమెంటు ని యోజకవర్గం ఇన్చార్జిలను నియమించాలని పిసిసికి సూచించారు. ఇన్చార్జీలు ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడాలన్నారు. అంటే సర్ పై కాంగ్రెస్ ఎంత అప్రమత్తంగా ఉందో అర్థమవుతుంది.
బి ఆర్ ఎస్ సైతం..
భారతీయ రాష్ట్ర సమితి సైతం కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. సభ్యత్వ నమోదు సమావేశాలు ఏర్పాటు చేసి అం దులో సర్ గురించి అవగాహన కల్పిస్తున్నా యి. ఇప్పటికే మల్కాజిగిరి, మేడ్చల్, కూకట్పల్లి నియోజకవర్గం సమావేశాలు జరి గాయి. కూకట్పల్లి లో జరిగిన సమావేశంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పా ల్గొని సర్ మీద కార్యకర్తలకు అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బూత్ స్థాయి నుంచి శ్రేణులను అ ప్రమత్తం చేశారు. బిజెపి సైతం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.
25 నుంచి ఇంటింటికి బిఎల్ ఓ లు
ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ 25వ తేదీ నుంచి జూలై 24 వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు (బి ఎల్ ఓ) ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. చనిపోయిన, వలస వెళ్లిన వారి ఓట్లతోపాటు బోగస్ ఓట్ల ను తొలగిస్తారు. ఒకే వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ ఉన్న ఓట్లను తీసివేస్తారు. బి ఎల్ ఓ లు ఇచ్చే పత్రంలో ఓటర్లు తమ వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి.
మేడ్చల్ జిల్లాలో వివిధ రాష్ట్రాలకు, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారి ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మేడ్చల్ జిల్లా మినీ భా రత్ ను తలపిస్తుంది. అనేకమంది స్వస్థలాల తో పాటు మేడ్చల్ జిల్లాలోనూ ఓటు హక్కు ను కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. మీరు రెండు చోట్ల ఓ కలిగి ఉన్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగిన సమయంలో ఇక్కడ ఓటు వేస్తారు. వారి స్వస్థలాల్లో జరిగిన సమయంలో అక్కడికి వెళ్లి ఓటు వేస్తారు. సర్ వల్ల వీరి ఓట్లు తొలగిపోనున్నాయి.
జిల్లాలో మ్యాపింగులో జాప్యం
బిఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లే ముందు ఓటరు జాబితా మ్యాపింగ్ చేయాలి. 2002 ఓటరు జాబితాను 2025 ఓటర్ జాబితాతో సరిపోల్చుతూ మ్యాపింగ్ చేయాలి. ఈ ప్రక్రియ మేడ్చల్ జిల్లాలో చాలా మందకోడిగా జరుగుతోంది. ఇప్పటి వరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. ఇంకా కేవలం 25 రోజులు మాత్రమే సమయం ఉంది. అంతలోపు మ్యాపింగ్ ఎలా పూర్తి చేస్తారనేది సందేహంగా మారింది.






