12 July, 2026 | 9:41 AM

ఆ ఘటన తర్వాత సెట్‌కు అమ్మవాళ్లను పిలవలేదు

14-12-2024 12:00 AM

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఏదో ఒక సందర్భంలో నటులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటారు. చాలా మంది నటులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పలు సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా సందీప్ కిషన్ సైతం టాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించారు. ‘రాయన్’తో కోలీవుడ్‌లోనూ విశేష ఆదరణను సొంతం చేసుకున్న సందీప్ కిషన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందుల గురించి మాట్లాడారు. “ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను ఎంబీఏ పూర్తి చేశా. కాలేజీలో ఉన్నప్పుడు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. నటుడిని కావాలనుకున్నప్పుడు కుటుంబసభ్యులు మొదట అంగీకరించలేదు. రానురాను నా ఇష్టాన్ని అర్థం చేసుకుని ప్రోత్సహించారు. అమ్మ ఇచ్చిన డబ్బుతో ఫోటో షూట్ చేసి ఆడిషన్స్‌కి వెళ్లా. దర్శకుడు గౌతమ్ మేనన్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. తొలినాళ్లలో చిన్న రోల్ కూడా దొరకలేదు. అలాంటి సమయంలో ‘ప్రస్థానం’లో చేసే అవకాశం వచ్చింది. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. నన్నెవరైనా లోకువగా చూస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ‘స్నేహగీతం’ సినిమా షూట్‌కు మా నాన్న వచ్చారు. అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు నాన్న ప్లేట్‌లో చికెన్ అయిపోవడంతో సర్వ్ చేస్తున్న వ్యక్తిని పిలిచి.. చికెన్ వేయమని అడిగాను. దానికి అతడు గిన్నె చూపించి.. ‘ఇదే ఉంది అందరూ తినాలి’ అన్నాడు. ఆ తర్వాత నుంచి అమ్మవాళ్లను ఎప్పుడూ నా సినిమా సెట్‌కు పిలవలేదు” అని సందీప్ తెలిపారు.