12 July, 2026 | 8:29 AM

మెంటల్ మదిలో జీవీ ఫస్ట్‌లుక్..

14-12-2024 12:00 AM

జీవీ ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మెంటల్ మదిలో’. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం హీరో ధనుష్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని చిత్రబృందాన్ని ధనుష్ విష్ చేశారు. ఈ చిత్రంలో మాధురీ జైన్  హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రానికి అరుణ్ రామకృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్యారలల్ యూనివర్స్ ప్రొడక్షన్ హౌస్ కోసం జి వి ప్రకాష్ కుమార్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన జీవీ ప్రకాశ్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన సెల్వరాఘవన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.