27 April, 2026 | 2:16 AM

ఎన్నికల తర్వాత ‘కడియం’ కథ కంచికే

11-05-2024 12:05 AM

బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్

హనుమకొండ, మే 10 (విజయక్రాంతి): ఎన్నికల తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కథ కంచికి చేరుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి, వంగపహాడ్, భవానీనగర్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తన తండ్రి శ్రీహరి పేరు చెప్పుకొని ఓట్లు అడుతున్నారని ఎద్దేవా చేశారు.

కడియం శ్రీహరినే ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అలాంటిది ఆయన కూతురిని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కావ్యను ఎంపీ అభ్యర్థిగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఒప్పుకోవడం లేదని, ఆమె ఎప్పుడు కాంగ్రెస్‌ఖు వెన్నుపోటు పొడిచి వెళ్తారోనని ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు.