ఓటు కోసం చెప్పుల రిపేర్
11-05-2024 12:05 AM
యాదాద్రి భువనగిరి, మే 10 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకగణం పడుతున్న తిప్పలు అన్నీ.. ఇన్నీ కావు..యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం లోని వలిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వినూత్నరీతిలో ప్రచారం చేపట్టారు. భువనగిరిలోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం వలిగొం డ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తూ రోడ్డుపక్కన చెప్పులు కుట్టే వ్యక్తి వద్ద చెప్పులకు రిపేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అన్నివర్గాల ప్రజలకు చేదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వాకా బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.






