ప్రతి ఒక్కరూ స్వీయ గణన నమోదు చేసుకోవాలి
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, ఏప్రిల్ 26 (విజయ క్రాంతి): జనాభా గణనలో ప్రతి ఒక్కరూ స్వీయ గణన నమోదు చేసుకోవాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం నుంచి మే 10వ తేదీ వరకు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు.
జిల్లాలోని మూడు చింతలపల్లి అలియాబాద్ ఎల్లంపేట మున్సిపాలి టీలలో 177 మంది ఎన్ని మారేటర్లను, 31 మంది సూపర్వైజర్ లను నియమించా మని తెలిపారు. ఒక్కో బ్లాక్ లో 800 మంది జనాభా కు ఒక న్యూమరేటర్ను నియమించమ న్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఇక్కడ నివసిస్తున్నందున ఇక్కడే నమోదు చేసుకోవాలని అన్నారు.
స్టెప్ బై స్టెప్ విధానం:
Self Enumeration (HLO) Login వద్ద తెలంగాణ ఎంపిక చేసి, Captcha ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయాలని సూచించారు. Welcome పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ మొత్తము 15 నిమిషాల్లో పూర్తి అవుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తము 15 నిమిషాల్లో పూర్తి అవుతుందని కలెక్టర్ తెలిపారు. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలని వచ్చిన OTP ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయాలని తెలిపారు. తరువాత నచ్చిన భాషను ఎంచుకోవాలని, జిల్లా, పట్టణం/గ్రామం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
మొబైల్ లో Location ON చేసి, మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ సెట్ చేయాలని, ఇళ్ల వివరాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, Preview ద్వారా చెక్ చేసి Submit చేయాలని సూచించారు. Submit చేసిన తరువాత H తో ప్రారంభమయ్యే 11 అంకెల SE Iడి వస్తుందని తెలిపారు. దాన్ని స్క్రీన్షాట్ లేదా నోట్ చేసుకుని భద్రపరచుకోవాలని తెలిపారు. మే 11 తరువాత ఇంటికి వచ్చే గణన అధికారికి ఈ SE Iడి చూపిస్తే వారు అప్రూవ్ చేస్తారన్నారు. స్వయంగా నమోదు చేసి సమయాన్ని ఆదా చేసుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 26 ఆదివారం నుండి మే 10 వరకు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందని ఇందులో జిల్లాలోని ప్రతి ఒక్కరూ పాల్గొని వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి సమాచారం నమోదు చేయబడుతుందని, ఇంటి పరిస్థితి సౌకర్యాలు ప్రాథమిక సమాచారం సేకరించబడుతుందన్నారు. స్వీయ గణన ఆన్లైన్ పోర్టల్ (se.census.gov.in) వ్బుసైటును సందర్శించి సెల్ఫ్ డిక్లరేషన్ ఐడి పొందాలని, ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే గణనలో గుర్తించబడిన ఉద్యోగులు సర్వే నిమిత్తం ఇంటికి వచ్చినప్పుడు మీ ఐడి తెలియపరచాలని తెలిపారు.
జనగణన వల్ల ప్రతి ఒక్కరి భవిష్యత్తు కార్యచరణ విధానాలకు ఖచ్చితమైన ఆధారం, వనరుల సరి అయిన పంపిణీ, ప్రణాళికలు, మెరుగైన సౌకర్యాలు పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, తమ ప్రాంతాల అభివృద్ధికి సహాయ, సహకారాలు పథకాల అమలు జనాభా గణాంకాలు ద్వారా వెల్లడించడం జరుగుతుందన్నారు, మీ సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుందని గోప్యంగా ఉంచబడుతుందని, పేర్లు గుర్తింపు బహిర్గతం చేయబడవని అన్నారు.






