పోటాపోటీ ప్రచారం
11-05-2024 12:05 AM
నర్సాపూర్, మే 10 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఒకే దగ్గర తమ పార్టీ అభ్యర్థికి ఒటేయాలని ప్రచారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం సోదరులు తమ ప్రార్థనలు ముగించుకుని మజీద్ నుండి బయటకు వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మదన్‌రెడ్డి, ఆవుల రాజిరెడ్డిలు తమ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తమ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రెండు పార్టీల వారు ఒకేసారి ప్రచారం నిర్వహించడంతో ఆశ్చర్యపోవడం అక్కడి ప్రజల వంతైంది.






