30 June, 2026 | 9:11 PM

Breaking News

డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •  

అనాఘపురి కాలనీలో అన్నీ సమస్యలే

21-04-2026 01:07 AM

సమస్యలపై అధికారులకు వినతి

మేడిపల్లి ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ పరిధిలోని అనాఘపురి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరు తూ సోమవారం డిప్యూటీ కమిషనర్కు విన తి పత్రం సమర్పించారు. కాలనీలో రోడ్లు, డ్రైనే జీ, త్రాగునీటి పైపులైన్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వీటి వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. 

ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దాచపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఆకుల సదాశివ గుప్త ఉపాధ్యక్షుడు ఏనుగు సంజీవరెడ్డి, సలహాదారుడు గొట్టిముక్కల వెంకటరెడ్డి, సత్యనారా యణ, కొమ్మ బాబు తదితరులు పాల్గొన్నారు.