బాటసింగారంలో వ్యవసాయ అవుట్‌రీచ్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : బాటసింగారంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వ్యవసాయ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు, స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ వినియోగదారులకు రుణ సౌకర్యాలు, బ్యాంకిం గ్ సేవలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ రీజియన్ రీజినల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. కార్యక్రమాన్ని బాటసింగారం శాఖ మేనేజర్ జి. వెంకటేష్ నిర్వహించారు.
సర్పంచ్ మడుగుల విజయ, ఉప సర్పంచ్ అనతి సు ష్మ, మండల అధ్యక్షురాలు విజయ, ఏపీఎం నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈకేవైసీ, రీకేవైసీ, ఏపీవై, పీఎంజేఏబీవై, పీ ఎం ఎస్‌బీవై వంటి బ్యాంకింగ్, సామాజిక భ ద్రతా పథకాలపై అవగాహన కల్పించారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే షీబిజ్ ఖాతాల ప్రయోజనాలను వివరించా రు. మొత్తం రూ.20 కోట్ల రుణ ప్రతిపా దన లు/లీడ్స్ లభించగా, రూ.7 కోట్ల రు ణాల ను పంపిణీ చేశారు. రైతులు, ఎస్‌హెచ్‌జీలు, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు బ్యాంకు కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.






