1.2 కిలోల గంజాయి పట్టివేత
18-08-2026 12:00 AM
కోదాడ, ఆగస్టు 17 (విజయక్రాంతి): కోదాడ పట్టణ పోలీసులు 1.2 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సోమవారం కోదాడ పట్టణంలో మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. పోలీసులు శ్రీరంగాపురం మామిడి తోటలో దాడులు చేయగా అక్కడ 1.2 కిలోల గం జాయి, 4 బైకులు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొండారి సైదులు, పసుపులేటి వెంకటేష్, చిన్నపంగు నవీన్, షేక్ ఫయాజ్ బాబా, షేక్ రహాస్, కొండ ని ఖిల్, షేక్ వాజిద్ లను అరెస్ట్ చేశామన్నారు.






