రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
- చిన్నారిని కాపాడిన స్థానికులు
- నిందితుడి అరెస్టు
అమీన్ పూర్, ఆగస్టు 17: రెండేళ్ల చిన్నారిపై దుండగుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా అ మీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చౌరస్తాలో ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌కు చెందిన రఘునాథ్.. ఆరుబయట ఆడుకుంటు న్న రెండేళ్ల చిన్నారిని తనవెంట ఇలాపూర్ తండా శివారులోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించా డు.
అదే సమయంలో చిన్నారి గట్టిగా ఏడవడంతో బొల్లారం గ్రామంలో పని ముగిం చుకుని ఇంటికి వెళ్తున్న శశికుమార్ సంఘటనా స్థలానికి వెళ్లాడు. అక్కడ నిందితుడు చిన్నారిపై లైంగిక దాడికి యత్నించడం గమనించి ఆ పాపను రక్షించి రఘునాథ్‌ను తన స్నేహితుడు నవీన్ సహాయంతో పట్టుకున్నా డు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అ మీన్ పూర్ పోలీసులు నిందితుడు రఘునాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.






