16 April, 2026 | 11:54 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

జోరుగా ఏరువాక

14-06-2025 10:42 PM

తెలిసిన వర్షాలతో రైతన్న బిజీ బిజీ

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జిల్లాలో 70% రైతులు వర్షా ఆధారంగానే పంటలు పండిస్తున్నంతో ఇప్పటికి వేసవి దిక్కులను దున్నుకున రైతులు తొలకరి వర్షాలతో విత్తనాలు వేసుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో వానకాల సీజన్లో 4.70 లక్షల ఎకరాలు వివిధ పంటలు సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి పంట సాగు చేస్తుండగా ఆ తర్వాత సోయా వరి మొక్కజొన్న పంటలు పప్పు దినుసు పంటలు రైతులు బాగు చేస్తున్నందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రతి సంవత్సరం జూన్ 10 తర్వాత వర్షాలు కురిసేవి ఆ తర్వాతనే రైతులు పంటలు సాగుపై దృష్టి పెట్టేవారు. కానీ ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఋతుపవనాల ప్రభావం తుఫాను కారణంగా వర్షాలు కురవడంతో రైతులు ఇప్పటికీ పంట భూములు పత్తి సోయా మొక్కజొన్న విత్తనాలను కూలీల సాయంతో వెతుక్కుంటున్నారు. వరి నాడు మడులను తయారు చేసుకొని వరి నారు పోసుకుంటున్నారు. మరోపక్క వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవడంతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎరువులు కొనుగోలు చేసుకుని నిలువ ఉంచుకుంటున్నారు. దీంతో పంట చీరల్లో రైతుల సందడి కనిపిస్తోంది