ఆట కంటే ఏదీ ముఖ్యం కాదు
స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా
దోహా: పారిస్ ఒలింపిక్స్‌లో ఏదైనా జరగొచ్చని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోనే ది బెస్ట్ అథ్లెట్స్ పోటీలో ఉంటారని పతకం కోసం కష్టపడాల్సిందేనంటూ వ్యాఖ్యానించాడు. శుక్రవారం నుంచి దోహా వేదికగా జరగనున్న ఫస్ట్ లెగ్ డైమండ్ లీగ్ టోర్నీలో నీరజ్ చోప్రా పాల్గొననున్నాడు. ఇదే టోర్నీలో నీరజ్ చోప్రాతో సహచర అథ్లెట్ కిశోర్ జెనా కూడా బరిలోకి దిగనున్నాడు. అనంతరం నీరజ్ స్వదేశంలో జరగనున్న ఫెడరేషన్ కప్ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల నీరజ్ చోప్రా ఒలింపిక్స్ సన్నద్ధతపై ప్రత్యేకంగా స్పందించాడు. ‘భారత్‌లో ఆడడం నా ప్రొఫైల్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లొచ్చు. కానీ నా దృష్టిలో ఆట కంటే ఏదీ ముఖ్యం కాదు. స్వదేశంలోనే ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పటికీ ఫంక్షన్లు, పెళ్లిళ్లతోనే టైం అయిపోతుంది. నా కుటుంబం, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడపాలనుకుంటా.
కానీ ఇది ఒలింపిక్ సంవ త్సరం. ఇలాంటి కీలక సమయంలో ఆటపై తప్ప వేరే దానిపై ఫోకస్ చేయకూడదని నిర్ణయించుకున్నా. టోక్యో ఒలింపిక్స్ ముందు వరకు నా ట్రెయినింగ్ అంతా భారత్‌లోనే సాగింది. ఆ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావడం వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్‌లో ఏ మూలకు వెళ్లినా నన్ను గుర్తుపట్టేస్తా రు. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలా నన్ను ఆరాధిస్తున్నారు. అథ్లెటిక్స్‌కు ఇది మంచి పరిణామం. ఇవా ళ దేశ ప్రజలు క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్‌ను విపరీతంగా ఫాలో అవుతున్నా రు. ఈ విభాగంలో దేశానికి మరిన్ని పతకాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో నా పూ ర్తి ట్రెయినింగ్ కొనసాగించలేను.
అందుకే దక్షిణాఫ్రికా, టర్కీ, స్విట్జర్లాండ్‌లో కోచ్ సహాయంతో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. పారి స్ ఒలింపిక్స్‌లో ఏదైనా జరగొచ్చు. భారత్ చాలా పెద్ద దేశం. నా నుంచి మరోసారి స్వర్ణ పతకం ఆశించొచ్చు. కానీ ఒలింపిక్స్‌లో అది ఎంత కష్టమో నాకు తెలు సు. ఎందుకంటే ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేయర్స్ పోటీలో ఉంటారు. అందుకే లక్ష్యం గురించి ఆలోచించడం లేదు. కేవలం నా ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాను. ఆరోగ్యంతో పాటు నా టెక్నిక్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తే అనుకున్న ఫలితం దక్కొచ్చు. గతేడాది 90 మీటర్లు విసరడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాను కానీ జావెలిన్‌ను 88 మీటర్లు మాత్రమే విసరగలిగాను. కానీ ఈసారి అలా చెప్పను. చేసి చూపించాలనుకుంటున్నా.’ అని నీరజ్ వెల్లడించాడు. ఇక ఒలింపిక్స్‌కు 1932 నుంచి అధికారిక టైమ్ కీపర్‌గా ఉన్న ఒమెగా సంస్థతో నీరజ్ చోప్రా ఒప్పందం కుదుర్చుకున్నాడు.






