4న మిడ్జిల్కు సీఎం రేవంత్‌రెడ్డి రాక
ఉమ్మడి మిడ్జిల్ ఉర్కొండకు భారీ నిధులు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మిడ్జిల్, జూలై1: ఉమ్మడి మిడ్జిల్ మండలానికి సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 4వ తేదీన వస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సీఎం సభ నిర్వహించే స్థలాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల క్రితం ఇదే జూలై నెలలో నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సామాన్య వ్యక్తిగా మిడ్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.
ఆ రోజు నుంచి నేటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తన రాజకీయ ప్రయాణంలో మిడ్జిల్ మండల ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో స్వయంగా పేర్కొన్నారని తెలిపారు. మిడ్జిల్ మండల ప్రజలపై ఉన్న కృతజ్ఞతాభావంతో, వారి రుణం తీర్చుకునే సంకల్పంతోనే విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనంతరం జడ్చర్ల ఫ్లైఓవర్ కింద ప్రమాదం జరిగి నా వ్యక్తికి గాయాలు కావడంతో తన వాహనంలో ఎక్కించుకొని ఆస్పత్రికి వైద్య చికిత్సల నిమిత్తం ఎమ్మెల్యే పంపించారు.






