2 July, 2026 | 12:56 AM

వీబీ జీరాంజీ చట్టం రద్దు చేయాలని ధర్నా

02-07-2026 12:02 AM

పెబ్బేరు, జూలై 1: పెబ్బేరు మండలం రామాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వీబీజీఆర్‌ఎంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. దేవన్న మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం నిధుల వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపడం వల్ల కూలీలకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఏడాది పొడవునా ఉపాధి పనులు కల్పించాలని, కొత్త మార్పులను రద్దు చేసి పాత నరేగా విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.