calender_icon.png 15 December, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ రాక

13-12-2025 01:31:24 AM

ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరు

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ ఉప్పల్ స్టేడి యంలో శనివారం జరుగనున్న దిగ్గజ సాకర్ ప్లేయర్ లియోనెల్ మెస్సి, సీఎం రేవంత్‌రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్‌బాట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహు ల్ గాంధీ హైదరాబాద్‌కు విచ్చేయనున్నారు. ఢిల్లీ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 2:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు.

సాయంత్రం 7 గం టల వరకు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కుదిరితే పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెస్సీని క్రీడామైదానంలోకి ఆహ్వా నిస్తారు. రాత్రి 9:15 గంటలకు స్టేడియం నుంచి బయల్దేరి, విందు తర్వాత విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 10:30 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.