గర్భిణి హత్యపై ఐద్వా ఆగ్రహం
కాగజ్‌నగర్, మార్చి 19 (విజయక్రాంతి) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామంలో మూడ్రోజుల క్రితం ఎనిమిది నెలల గర్భిణి ఆదివాసి సమ్మక్క (25) హత్య ఘటనపై ఐద్వా మహిళా సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సభ్యులు డీఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. సమ్మక్కను హత్య చేసిన నిందితుడు కేర్కర్ చలపతిని వెంటనే అరెస్ట్ చేసి, హత్యకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందించడంతో పాటు జిల్లా అధికారులు గ్రామాన్ని సందర్శించాలని కోరారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుం డా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమ్మక్క కుటుంబానికి న్యా యం జరిగే వరకు ఐద్వా మహిళా సంఘం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు మాచర్ల వినోద్, దుర్గం అనిత, షాహిన్, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ముం జం ఆనంద్ పాల్గొన్నారు.




