ఎయిరిండియా టికెట్ల ధరల పెంపు
08-04-2026 01:30 AM
ప్రయాణికులపై ఇంధన సర్‌ఛార్జీల వడ్డన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ టికెట్లపై ఫ్యూయల్ సర్‌ఛార్జీలను పెంచుతున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. టికెట్లపై కనిష్ఠంగా రూ. 299 నుంచి గరిష్ఠంగా రూ. 899వరకు పెం చింది. డొమెస్టిక్ ప్రయాణికులకు బుధవారం నుంచి, అంతర్జాతీయ ప్రయాణికులకు ఏప్రిల్ 10 నుంచి ఈ చార్జీలు వసూలు చేస్తామని తెలిపింది.
0 కి.మీ. వరకు రూ. 299, 501 నుంచి 1000 కి.మీ. వరకు రూ. 399, 1001 నుంచి 1500 కి.మీ. వరకు రూ. 549, 1501 నుంచి 2000 కి.మీ. వరకు 749, 2వేల కి.మీ. పైబడిన ప్రయాణ టికెట్లపై రూ.899 చొప్పున ఫ్యూయల్ సర్‌ఛార్జీ వసూలు చేయనున్నారు. పశ్చిమాసియా యుద్ధం, చమురు ధరల పెరుగుదల విమానయాన రంగంపై పడింది.




