15 July, 2026 | 5:30 PM

Breaking News

భాగిర్తిపల్లి గ్రామపంచాయతీకి బాడీ ఫ్రీజర్ విరాళం   •   ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి   •   లక్క పురుగుల బెడదతో విలవిలలాడుతున్న గ్రామాలు..!   •   పెద్ద ఆత్మకూరు పల్లె దవాఖానను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం   •   కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు   •   93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి   •   క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •  

ఉద్యమంలో సర్వం కోల్పోయాను!

22-08-2024 12:00 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయమది.. ఓ వైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష సాగుతుండగా.. మరోవైపు ఆం దోళనలు తీవ్రమవుతున్నాయి. అదే సమయంలో 2009 డి సెంబర్ ఆరున జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం క ట్కూరు గ్రామానికి చెందిన యువకుడు ఆత్మబలిదానానికి సిద్ధమయ్యాడు. దేవరాయ ఎల్లయ్య లక్ష్మీ దంపతుల కుమారుడు రమేష్ గ్రామంలోని వాటర్ ట్యాంక్ మీది నుంచి ఒ క్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ కిందికి దూకాడు. చావుబతుకుల్లోనూ తెలంగాణ నినాదమే వినిపించాడు. 

అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన రమేష్  తెలంగాణ వస్తేనే యువకుల జీవితాలు బాగుపడతాయని బలంగా నమ్మాడు. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందని భావించి ఆత్మబలిదానానికి సిద్ధమయ్యాడు. ఆయన అనుకున్నట్టు తెలంగాణ సిద్ధించింది. కానీ ఆయన జీవితం అతలాకుతలమైంది. ట్యాంకు మీది నుంచి దూకడంతో రెండు కాళ్లతో పాటు వెన్నుముక విరిగిపోయింది. దాదాపు నాలుగేళ్లు ఆయన మంచానికే పరిమితమయ్యారు. వెన్నుపూస విరగడంతో 14 రాడ్లు వేశారు. ఇప్పటికీ ఆయన నడుము నొప్పితో బాధపడుతున్నారు.

ఎడమ కాలు పూర్తిగా పనిచేయడం లేదు. ప్రస్తుతం కర్ర సాయంతో మాత్రమే నెమ్మదిగా నడవగలరు. ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్నే పనంగా పెట్టిన రమేష్‌కు మిగిలింది అంగ వైకల్యం మాత్రమే. తనను తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగానూ ఆదుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల పింఛన్, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన గత సర్కార్.. తెలంగాణ కోసం సర్వస్వం కోల్పోయిన తనకు మాత్రం ఎలాంటి సాయం లేదన్నారు. దివ్యాంగ పింఛన్‌తోనే భార్యతో పాటు ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నా నని  చెప్పారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ అయినా స్పందించి తనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వేడుకుంటున్నారు.

- జనగామ, విజయక్రాంతి