calender_icon.png 4 September, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల దుర్వినియోగం ఆరోపణ..ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారి అరెస్ట్

31-08-2025 12:09:20 AM

  1. సీనియర్ మేనేజర్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
  2. రాహుల్ విజయ్‌పై 232 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలు

న్యూఢిల్లీ, ఆగస్టు 30: నిధుల దుర్వినియోగం ఆరోపణలతో భారత విమానా శ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి చెందిన ఓ సీనియర్ మేనేజర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ట్రేడింగ్ కోసం రూ. 232 కోట్ల నిధులను తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించాడని సీబీఐ పేర్కొంది. ఇటీవల సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో సదరు ఉద్యోగి బాగోతం బట్టబయలైంది. దీంతో అధికారులు ఓ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో కూడా ఉద్యోగి మోసం బయటపడింది. ఏఏఐ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ విజయ్ అధికారిక నివాస ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. 2019 మధ్య కాలంలో డెహ్రాడూన్ విమాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఉద్యోగి ఈ మోసానికి పాల్పడి నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. జైపూర్‌లోని అతడి నివాస సముదాయాల్లో సోదా ల అనంతరం సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటన విడుదల చేసిన సీబీఐ అధికారులు ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.