31-08-2025 12:13:17 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీవో)లో పాల్గొనేందుకు ట్రంప్ చైనా వెళ్లారు. జపాన్ పర్యటన సందర్భంగా భారత్ మధ్య 13 ఒప్పందాలు కుదిరాయి. శనివారం జపాన్ ప్రధాని షిగురు ఇషిబాతో కలిసి జపాన్ రాజధాని టోక్యో నుంచి సెండాయ్‌కి దాదా పు 370 కిలోమీటర్ల దూరం బుల్లెట్ రైలు లో మోదీ పయనించారు. ఈ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
బుల్లెట్ రైలులో ప్రయాణించిన అనంతరం టోక్యో ఎలక్ట్రాన్ కంపెనీలో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను మోదీ, ఇషిబా సందర్శించారు. ‘ప్రధాని ఇషిబాతో కలిసి టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీని సందర్శిం చా. ట్రైనింగ్ రూం, ప్రొడక్షన్ ఇన్నోవేషన్ ల్యాబ్‌లోకి వెళ్లి.. కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యాం. ఇండియా సహకారంలో సెమీకండక్టర్ పరిశ్రమ అత్యంత ముఖ్యమైనది’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
తియాంజిన్ గడ్డపై అడుగుపెట్టిన మోదీ..
ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ తియాంజిన్‌కు చేరుకున్నారు. ఏడేళ్ల నుంచి ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2018లో ఆ యన చివరిసారిగా చైనాలో పర్యటించారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో తి యాంజిన్ వేదికగా జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. తి యాంజిన్‌లో ఉన్న భారతసంతతి వ్యక్తులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. తియాంజిన్ చేరుకున్నట్టు ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొ న్నారు.
ఆదివారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో, సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మోదీ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అమెరికా అద నపు సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ మోదీ, జిన్‌పింగ్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి చమురు కొను గోలు చేస్తున్నామనే అక్కసుతో ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు.
జపాన్ ప్రధాని దంపతులకు ప్రత్యేక బహుమతులు
పర్యటన సందర్భంగా జపాన్ ప్రధాని ఇషిబా దంపతులకు ప్రధా ని మోదీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఏపీలో లభిం చే చంద్రకాంత రాయితో తయారు చేసిన రామెన్ బౌల్స్, వెండి చాప్‌స్టిక్స్‌ను బహూకరించారు. అంతే కా కుండా కశ్మీర్ హస్తకళల విశిష్టతను చాటే పశ్మీనా శాలువా అందజేశా రు. కాగితపు గుజ్జు, జిగురు, ఇతర పూజా సామగ్రి కలిపి అందంగా త యారు చేసిన ఈ శాలువా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జపాన్ పర్యటనను ముగించుకున్న మోదీ ఎస్ సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనాకు వెళ్లారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్ చేశారు. ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు కోసం చైనాకు వెళ్లిన మోదీ అక్కడ పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా యుద్ధానికి సంబంధించిన తాజా పరిణామాలను జెలెన్‌స్కీ మోదీకి వివరించినట్టు సమాచారం. శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత మద్దతు ఉంటుందని మోదీ జెలెన్‌స్కీతో పేర్కొన్నారని పీఎంవో పేర్కొంది.