డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
దేవరకొండ: సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలనీ, పలు గ్రామాలలో బస్సు సౌకర్యాలు కల్పించాలని శుక్రవారం దేవరకొండ డిపో మేనేజర్(Devarakonda Depot Manager) కి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ(AISF District Secretary Mudigonda Muralikrishna) మాట్లాడుతూ... నాంపల్లి మండలంలోని దేవత పల్లి, దామెర, నేరెళ్ల పల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, సమయానికే అనుగుణంగా విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యాసంస్థల ప్రారంభమై నెల రోజులు కావస్తున్న గ్రామాలలో విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. బస్సు లేని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, శ్రీధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.






