calender_icon.png 21 June, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు

20-06-2025 07:19:11 PM

కోదాడ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) జన్మదిన వేడుకలు మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రంగా థియేటర్ ఆవరణలో ఏర్పాటుచేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పారా సీతయ్యల చేతుల మీదుగా కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, సుధీర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్కెర చిన్నపరెడ్డి, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు వెంపటి మధుసుదన్, మిల్లర్స్ నీలా సత్యనారాయణ, జయప్రకాష్, కొత్త బ్రహ్మయ్య పాల్గొన్నారు.