15 April, 2026 | 10:39 AM

ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాలు

01-11-2025 12:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 31: ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ ఉత్సవాలను పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి రావినారాయణరెడ్డి కాలనీ ఫేస్2లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్రచారి, ముత్యాల యాదిరెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ద్వారా కార్మికుల హక్కులను సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కిందన్నారు.

కార్మికులకు కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత కోసం రాబోయే కాలంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి అజ్మీరా హరి సింగ్ నాయక్, నాయకులు కేతరాజు నర్సింహా, దాసరి ప్రసాద్, యేశాల నర్సింహా, గడ్డం నరసింహ, ఈశ్వరయ్య, ధూపం మధు, బండి వెంకటయ్య, గోరిమియా, లింగయ్య, శ్రీను, బిచ్చు నాయక్, లాలప్ప, వట్టి నవనీత, నీల, కావేరి, రమేష్ పాల్గొన్నారు.