31-10-2025 11:33:59 PM
జిల్లా పంచాయతి అధికారి వెంకటేశ్వర్ రావు
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పారిశుద్ధం మెరుగుపరిచి, వీధుల్లో చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం మండలంలోని పొన్నారం సారంగపల్లి గ్రామ పంచాయతీలను ఆయన అకస్మికంగా సందర్శించి, గ్రామ పంచాయతీ రికార్డులు పరిశీలించారు. వాటర్, శానిటేషన్ కు సంభందించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు.
గ్రామంలో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీ వర్కర్ల చేత ప్లాస్టిక్ సేకరణ చేయించాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంక్ లు శుభ్రపరచాలని, క్లోరినేషన్ చేయాలన్నారు. ఇంటి పన్ను వసూలు ను వేగవంతం చేసి రసీదులను ఆన్లైన్ చేయడం తో పాటు నవంబర్ 15 వరకు 100% పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమo లో ఎంపీఓ ఎం సత్యనారా యణ, పంచాయితీ కార్యదర్శి హరీష్, సిబ్బంది పాల్గొన్నారు.