12 June, 2026 | 4:03 PM

Breaking News

ఉప్పల్‌ భాగయత్ లోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం   •   స్కై వాక్ లిఫ్ట్ లో చిక్కుకున్న యువకుడు.. రెండు గంటలపాటు నరకయాతన   •   చెట్టు కొమ్మల్లో కరెంటు తీగలు.. పట్టించుకోని అధికారులు   •   కెసిఆర్ స్ఫూర్తితో జన్మదిన రోజున మొక్కలు నాటిన మాజీ ఎంపీపీ   •   సారంగపల్లి అడవిలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం.. కలకలం..   •   విధుల్లో అలసత్వం.. 8 మంది అంగన్‌వాడీలపై క్రమశిక్షణ చర్యలు   •   ఖానాపూర్ సబ్ రిజిస్టార్ గా కిరణ్ తేజావత్   •   రైతు కొడుకుకు డాక్టరేట్   •   శాంతిఖనిలో ఏఐటీయూసీ ధర్నా..   •   ఎన్నికల అధికారులు పారదర్శకంగా పనిచేయట్లేదు: ఖర్గే   •  

శాంతిఖనిలో ఏఐటీయూసీ ధర్నా..

12-06-2026 03:31 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పలు డిమాండ్ల పై శాంతిగనిలో AITUC ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మంతెన రమేష్ అధ్యక్షతన  జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రెటరీ దాసరి తిరుపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పొరేట్ స్థాయిలో అమలు కాని  30 డిమాండ్ల కోసం సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని, కార్మికులందరూ సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శాంతిఖని మైన్ 36 లెవెల్, 37లేవల్ నుండి 49లెవెల్ వరకు వెంటిలేషన్ను తాగునీటిని కార్మికుల సరిపడా అందించాలనీ, KG టైమింగ్స్ ను పాత పద్ధతిలోనే నడిపించాలి.

డెసిగ్నేషన్ ఫేస్ వర్కర్లను శాంతిఖని మైన్ కి రప్పించాలనీ డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను యాక్టింగ్ చేస్తున్న వారికే వెంటనే ప్రమోషన్ కల్పించి భర్తీ చేయాలనీ,మెయిన్ గేట్ నుండి ఇంటర్నల్ రోడ్స్ పూర్తిగా పాడైనందున కొత్తగా రోడ్లు వేయాలనీ ఆందోళన చేపట్టామన్నారు. ఈ డిమాండ్లతో  శాంతిఖని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా కు మెమోరండం అందజేశారు.ఈ కార్యక్రమంలో దాడి రమేష్, సంతోష్ కుమార్, రాజలింగ్ సార్, మంతెన భాస్కర్, శ్రీకాంత్, సారయ్య, రాజయ్య, సేఫ్టీ కమిటీ సభ్యులు మైన్స్ కమిటీ సభ్యులు, వర్క్ మైన్ ఇన్స్పెక్టర్లు, టెంపుల్ కమిటీ సభ్యులు, క్యాంటీన్ కమిటీ సభ్యులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.