17-02-2026 12:29:18 AM
ఓయూ వైస్ ఛాన్స్‌లర్ కుమార్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాం తి): ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సహకారంతో ఏఐయూ సెంట్రల్ జోన్ వైస్- చాన్స్‌లర్స్ మీట్ 2025 హైదరాబాద్‌లో నిర్వహించనున్నారని ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ కుమార్‌మొలుగారం అన్నారు. ఉస్మాని యా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక విద్యా సదస్సుకు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది వైస్-చాన్సలర్లు, సీనియర్ అకాడెమిక్ నిర్వాహకులు హాజరుకానున్నారు.
ఈ సదస్సు ప్రారంభోత్సవానికి 19 న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా, ఈ కార్యక్రమానికి ఏఐయూ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక, ఏఐ యూ సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ మిట్టల్ హాజరవుతారని చెప్పారు. మూడు సాంకేతిక సమావేశాలతో పాటు ప్రత్యేక బిజినెస్ సెషన్ కూడా నిర్వహించబడుతుంది. కార్యక్రమంలో రిజిస్టర్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వైస్ ఛాన్స్‌లర్ ఓఎస్డి ప్రొఫెసర్ ఎస్. జితేంద్రకుమార్ నాయక్, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్, ప్రొఫెసర్ ప్యాట్రిక్, ప్రొఫెసర్ సుజాత, ఆర్గనైజింగ్ కమి టీ మెంబర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్ పాల్గొన్నారు.