17-02-2026 12:27:38 AM
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, ఫిబ్రవరి ౧6 (విజయక్రాంతి): సేవాలాల్ నగర్ వెల్ఫేర్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 287 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ సేవలను కొనియాడారు.
సేవాలాల్ మార్గంలో అందరం పయనించి ఆయన ఆశయాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ జయంతి ఉత్సవాల అధ్యక్షుడు సభావత్ శంకర్ కూకట్ పల్లి నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు పగడాల శిరీష బాబురావు, పండాల సతీష్ గౌడ్, సబియా బేగం, తూము శ్రావణ్ కుమార్, నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా, డివిజన్ అధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్ గౌడ్, అంబటి శ్రీనివాస్, కైలా భీమ్రావు, గడ్డం శ్రీనివాస్, యాద య్య గౌడ్, కృష్ణ, లలిత, అనిత కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.