22 March, 2026 | 7:48 AM

ఐపీఎల్ నుంచి ఆకాశ్ దీప్ ఔట్

22-03-2026 12:00 AM

కోల్‌కతాకు దెబ్బ మీద దెబ్బ

కోల్‌కతా, మార్చి 21 : ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షాక్ మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే హర్షిత్ రాణా గాయంతో దూరమవ గా.. పతిరణ ఆలస్యంగా జట్టుతో చేరనున్నా డు. ఈ నేపథ్యంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆ జట్టు స్టార్ పేసర్ ఆకాశ్ దీప్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావా సంలో ఉన్నాడు.

29 ఏళ్ల ఈ బెంగాల్ పేసర్‌ను కేకేఆర్ వేలంలో కోటి రూపాయలకు దక్కించుకుంది.ఆకాష్ దీప్ తరచుగా గాయా ల బారిన పడుతున్నాడు. ఈ కారణంగానే టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 2022లో ఐపీఎల్ అరంగ్రేటం చేసిన ఆకాశ్.. నాలుగు సీజ న్లలో కేవలం 14 మ్యాచ్‌లే ఆడాడు. గత సీజన్‌లో అతడు లక్నో సూపర్ జెయింట్స్ తరు పున ఆడాడు. వేలంలో అతడిని 8 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లే తీశాడు. దీంతో సీజన్ పూర్తి కాగానే లక్నో అతడిని వదిలేసింది.

ఇదిలా ఉంటే ఆకాశ్ దీప్ కూడా దూరమవడంతో  కోల్‌కతా బౌలింగ్ మరింత బలహీనంగా మారింది. బంగ్లా బౌ లర్ ముస్తఫిజర్‌ను వదిలేసిన కేకేఆర్ అతని స్థానంలో జింబాబ్వే పేసర్ ముజరబానీని తీసుకుంది. లంక పేసర్ మతీషా పతిరానా ను వేలంలో 18 కోట్లకు తీసుకోగా.. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ప్రస్తుతం  కోల్‌కతా జట్టులో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మా లిక్, కార్తిక్ త్యాగిలు మాత్రమే భారత పేసర్లుగా ఉన్నారు. ఇక రూ.25.20 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన ఆల్‌రౌండ్ కామెరూన్ గ్రీన్‌తో కొన్ని ఓవర్లు వేయించే అవకాశం ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న  వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది.