ఇప్పుడే మనకు అసలైన పరీక్ష
ఆర్సీబీ ప్లేయర్స్‌కు కోహ్లీ హెచ్చరిక
బెంగళూరు, మార్చి 21: ఐపీఎల్ 19వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తమ టీమ్ ప్లేయర్స్‌కు వార్నింగ్ ఇ చ్చాడు. ఇప్పటి నుంచే అసలైన పరీక్ష మొదలవుతుందని హెచ్చరించాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ట్రైనింగ్ సెషన్‌లో సహచరులను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చాడు. గత రెండు మూడు సీజన్లలో బాగా కష్టపడినందుకు 2025లో ట్రోఫీ గెలిచామనీ, ఇకపై ప రిస్థితి మరింత కఠినంగా ఉంటున్నాడు.
గతంతో పోలిస్తే మిగిలిన జట్లు తమపై మరిం త బలంగా ఎటాక్ చేస్తాయన్నాడు. అందుకే తాము మరింత అ ప్రమత్తంగా ఉండాలనీ, ప్లేయర్స్ ఎవ్వ రూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకూడదన్నాడు. ప్రతీ ప్రాక్టీస్ సెషన్‌లో 120 శాతం ఇవ్వాలనీ, మ్యాచ్‌లో 200 శాతం ఎఫర్ట్ పెట్టాల న్నాడు. ఈ రెండు నెలల పాటు మరింత కష్టపడాలంటూ సహచరులను ఉత్సాహపరిచా డు. గత సీజన్ వరకూ టైటిల్ కోసం పోరాడిన తాము ఇప్పుడు దానిని నిలబెట్టుకునేం దుకు మరింతగా కష్టపడాలని స్పష్టం చేశాడు.
అందుకే మరింత ఒత్తిడి ఉంటుందని సహచరులను హెచ్చరించాడు. మరోవైపు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా కోహ్లీ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. ఈ సీజన్ కోసం తమ ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకున్నట్టు చెప్పా డు. జట్టు కూర్పుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలం ఆసక్తికరంగా సాగిందనీ, తమ బెంచ్‌ను మరింత మెరుగుపరుచుకున్నట్టు చెప్పాడు. కొత్తవారి రాకతో జట్టు బలం పెరిగందన్నాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీపైనే అందరి చూపు ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా టెస్ట్, టీ20లకు గుడ్ బై చెప్పిన విరాట్ ఐపీఎల్‌లో ఎలా ఆడతాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




