26 August, 2026 | 11:31 PM

ఆకాశ్ విద్యార్థులకు ర్యాంకుల పంట

21-05-2024 02:36 AM

హైదరాబాద్, మే౨౦ (విజయక్రాంతి): తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో ఆకాశ్ విద్యాసంస్థల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట బ్రాంచి విద్యార్థులు సైఫ్ ఉర్ రెహ్మాన్ ౨౫౯ (ద్వితీయ సంవత్సరం), శరణ్య వరాహలక్ష్మి ౪౨౯ (ద్వితీయ సంవత్సరం), ధృవ్ ఝూవర్ ౪౫౩ (తృతీయ సంవత్సరం) ర్యాంకులను కైవసం చేసుకున్నారని బ్రాంచి మేనేజర్ శ్రీధర్ తెలిపారు.  క్రమశిక్షణ గల బోధనలో ఆకాశ్ ఇనిస్టిట్యూట్ ముందుంటుందని పేర్కొన్నారు.

భావితరాలను అత్యున్నత శిక్షణతో ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తమ సంస్థ ముందుంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ.. ఆకాశ్ విద్యాసంస్థలో తీసుకున్న శిక్షణతోనే తాము ఇంతటి ర్యాంకులను సాధించామని తెలిపారు. నీట్ ఐఐటీ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా తమ సంస్థ నంబర్ 9866540606లో సంప్రదించవచ్చని సూచించారు.